Cheating Trade: విజయవాడలో ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. ఇప్పటి వరకు 100 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 25 కోట్ల వరకు మోసపోయినట్టు ఫిర్యాదులు అందాయి. ఇంకా బాధితులు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సంస్థ అధినేత ఆదిత్యను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. స్టాక్ ఎక్చేంజీల్లో ట్రేడింగ్ పేరిట బెజవాడ వేదికగా అద్విక ట్రేడింగ్ సంస్థ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.…