పుష్ప అంటే ప్లవర్ కాదు, ఫైర్ అని బాక్సాఫీస్ వద్ద చాటుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న జనం ముందు నిలిచింది. వారి మనసులు గెలిచింది. ఫిబ్రవరి 4వ తేదీన పుష్ప చిత్రం అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సినిమా యాభై రోజులకు గాను రూ.350 కోట్లు పోగేసిందని తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్లు ఉత్తరాది నుండే వచ్చాయని చెబుతున్నారు. బహుభాషా చిత్రంగా పుష్పను జనం…