సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున థాంక్స్ చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది అంటూ ఆ దేశ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటించడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియా వేదికగా.. వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు.