Special Story on Vikram S Kirloskar: ప్రతి ఒక్కరికీ బాల్యం నుంచి ఏదో ఒక అంశం మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. దానికి అనుగుణంగా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటే గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఓ వ్యక్తి దీనికి తగ్గట్లే నడుచుకున్నాడు. చిల్లపిల్లాడిగా ఉన్నప్పుడే చక్కగా బొమ్మలు చెక్కేవాడు. సరికొత్త వస్తువులను తయారుచేసేవాడు. నూతన విమాన నమూనాలను రూపొందించేవాడు. మొత్తమ్మీద నిర్మించటం అనే కాన్సెప్ట్‌కు కనెక్టయ్యాడు. పెద్దయ్యాక ఇంజనీరింగ్ కోర్సును తెగ ఇష్టపడ్డాడు. పరిశ్రమను ప్రేమించాడు.