మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. ఏడాది ఆఖరులో ఓయో ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఓయో బుకింగ్‌లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది. ట్రావెలోపీడియా 2024' నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశంలో మతపరమైన పర్యాటకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్‌లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది.
మాల్దీవులు ఇటీవల చాలా మందికి కలల గమ్యస్థానంగా మారింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తమ హనీమూన్, బీచ్ వెకేషన్ లేదా విశ్రాంతి కోసం ఇక్కడికి వస్తారు. ఈ దేశం ఏడాది పొడవునా టూరిస్టులతో నిండి ఉంటుంది.