ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్: ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు…
ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు బెయిల్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ కేసులో విచారణ చేసిన ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టి వేసింది. చంద్రబాబు విచారణకు సహకరించపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేయండి.. ఈ దశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని కేసు…
నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ: ఇన్నర్ రింగ్ రోడ్ ( ఐఆర్ఆర్) భూకుంభ కోణం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ కేసులో విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించబోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడుకి ఈనెల(జనవరి) 10వ తేదీన ఏపీ…
కేఏ పాల్ సవాల్: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల మీటింగ్ ఉత్తరాంధ్రలో జరిగింది. కొందరు ఎన్టీ రామారావు తో లోకేష్ న్ పోలిస్తున్నారు. ఇదేం పోలిక, కనీసం పెద్ద ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చండి. నేను సత్యం మాత్రమే మాట్లాడతాను. చంద్రబాబు, లోకేష్ కు 10 ప్రశ్నలు అడుగుతున్నాను. ముఖ్యమంత్రి…
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సీఎం భేటీ కానున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్సభ ఎన్నికలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా…