భావకవులు ఎవరికీ అర్థం కాని పాటలు రాసుకొని తమ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారని కొందరి విమర్శ. అయితే ఊహాలోకంలో విహరించమనే ఐన్ స్టీన్ వంటి మేధావులు సైతం సెలవిచ్చారు. నేటి ఊహ, రేపటి వాస్తవం కావచ్చునని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు. తెలుగునేలపై భావకవితకు పట్టం కట్టి ఊరూరా, వాడవాడలా పలువురు యువకవులను ఊహాలోకాల్లో విహరింప చేసిన ఘనుడు దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి. ఆయన భావకవితకు జేజేలు పలికారు జనం. వాస్తవికతకు దూరంగా ఉండే భావుకత ఎంతవరకు సమంజసం…