నేడు అనంతపురం జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె పాలసముద్రం వద్ద నిర్మించనున్న జాతీయకస్టమ్స్ పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీకి భూమి పూజ నిర్వహించనున్నారు. నేడు మణిపూర్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్‌రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు…
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నేడు ప్రారంభం కానుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా తణుకులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సభలోనే లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. నేడు ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఆయన మహిళ ఉద్యోగులతో కలిసి పాల్గొననున్నారు. ఢాకాలో నేడు హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ జరుగనుంది. సెమీస్‌లో జపాన్‌తో భారత్ తలపడనుంది. బీజేపీ పార్లమెంటరీ…