కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి. స్వామి వారికి నైవేద్యంగాగా సమర్పించే లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు పరమపవిత్రం. ఆ శ్రీవారి దర్శనం కోసం వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి గంటల కొద్దీ క్యూ లైన్స్ లో నిలబడి ఆ తిరుమలేశుడిని దర్శించుకుని అనంతరం స్వామి వారి లడ్డు ప్రసాదం స్వీకరించి గోవిందా అని లడ్డూను ఆరగిస్తూ పొంగిపోతుంటారు భక్తులు. తిరుమలకు వెళ్లొచ్చిన వారు స్వామివారి లడ్డూను ప్రసాదంగా ఇస్తే కళ్ళకు అద్దుకుని…