రాయలసీమలో సుప్రసిద్ధ జాతరగా పేరొందిన తిరుపతి తాతయ్యగుంట ‘గంగమ్మ జాతర’కు అరుదైన గౌరవం దక్కింది. పాఠ్య పుస్తకాలలో జాతరను పాఠ్యాంశంగా తమిళనాడు ప్రభుత్వం పెడుతోంది. పదో తరగతి తెలుగు రీడర్‌లో గంగ జాతర పాఠ్యాంశం ఉంటుంది. ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన గంగ జాతరను తమిళనాడు సర్కార్ పాఠ్యాంశంగా ముద్రించింది. జానపద సాహిత్యాన్ని ఆదరించిన తమిళనాడు ప్రభుత్వానికి రచయిత పేటశ్రీ ధన్యవాదాలు తెలిపారు. Also Read: Payyavula Keshav: కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని…
తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక నుంచి గంగమ్మ జాతరను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.