తిరుమలలో సంచలనం కలిగించిన బాలుడి కిడ్నాప్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కిడ్నాప్ కి గురైన బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీసీటీవీ పుటేజి ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న ఉదయం రైల్వే స్టేషన్ కి బాలుడితో సహ కిడ్నాపర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి. కిడ్నాపర్ తెలుగు భాష మాట్లాడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తిరుపతి నుంచి ట్రైన్ ద్వారా నెల్లూరు లేదా కడపకు…