తిరుపతి విమానాశ్రయ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది.. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ చేయనున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి విమానాశ్రయం కూడా ఒకటి. ప్రైవేటుపరం కానున్న మొత్తం 13 విమానాశ్రయాల్లో చిన్నవి ఏడింటినీ మిగిలిన ఆరు పెద్ద విమానాశ్రయాలతో విలీనం చేయనున్నారు. తిరుచ్చి విమానాశ్రయ పరిధిలోకి తిరుపతి విమానాశ్రయం రానుంది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, విమానాల సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోంది. విశాఖపట్నం, విజయవాడ తర్వాత ఏపీలో అత్యధిక…