ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. అయితే అన్ని బాధల కంటే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. చాలామందికి తలలో కొట్టుకుంటున్నట్లుగా..వస్తూ పోతున్నట్లుగా..తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ…