ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను తదుపరి విచారణ జూలై 19 వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. బుధవారం వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించే వరకు బెయిల్ కొనసాగనుందని ప్రకటించింది.