ప్రముఖ నటుడు విశాల్ నటించిన ‘తుప్పరివాలన్’ చిత్రం తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో డబ్ అయ్యింది. 2017లో విడుదలైన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో దీనికి సీక్వెల్ చేయాలని అప్పట్లోనే విశాల్ భావించాడు. అయితే దర్శకుడు మిస్కిన్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సీక్వెల్ అనుకున్న సమయానికి పట్టాలెక్కలేకపోయింది. దాంతో ‘తుప్పరివాలన్ -2’ కు తానే డైరెక్షన్ చేయాలనే నిర్ణయానికి విశాల్ వచ్చేశాడు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ…