నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారాన్ని హైకోర్టు చాలా సీరియస్‌గా తీసుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు. అసలు కోర్టులో దొంగలు ఎందుకు పడ్డారు.. దేని కోసం ఈ దొంగతనం జరిగిందో చూడాలన్నారు. మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఏ1గా ఉన్న కేసులో డాక్యుమెంట్లు చోరీ కావడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కోర్టులో దొంగతనం అనేది దేశంలో ఇప్పటి వరకు జరగలేదని.. ఇదే తొలిసారి…