కోలీవుడ్ నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మానాడు’.. తెలుగులో ‘ది లూప్’ పేరుతో వస్తోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ముగిసింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశారు. దీపావళి సందర్బంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు ట్రైలర్ లో ప్రకటించారు. శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య,…