రష్మిక హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి మరో కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమాకి మొదటి నుంచీ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. టెక్నికల్‌గా సినిమా బాగానే ఉన్నా, ఎంచుకున్న లైన్ బాలేదని చాలామంది విమర్శించారు. కేవలం అబ్బాయిలను విలన్లుగా చిత్రీకరించి ఇలా సినిమా ఉందని చాలామంది యూత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఈ మధ్యకాలంలో ‘గీతా…