జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ ఎత్తేసిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయి. ఎప్పటికప్పుడు లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నా… భద్రతా బలగాలు వరసగా ఎన్ కౌంటర్లు చేసి ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి. సరిహద్దుల వెంబడి పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదుల సంఖ్య చాలా వరకు తగ్గింది. భద్రతా బలగాలు సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతో చాలా వరకు…