ఏపీలో అయ్యన్న పాత్రుడి ఇష్యూ పొలిటికల్ హీట్ ను పెంచింది. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది. దీంతో ఇరు పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు అయ్యన్న పాత్రుడి ఇంటిని చుట్టుముట్టారు. కాగా అయ్యన్న అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పంట కాలువలను ఆక్రమించుకొని గోడ కట్టడంతో వివాదం రాజుకుంది. అయ్యన్న పాత్రుడి ఇంటి ఆక్రమణలను కూల్చివేయడం…