రష్యాకు చెందిన టెన్నిస్ మాజీ స్టార్ మరియా షరపోవా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటివరకు షరపోవాకు పెళ్లి కాలేదు. అయితే ఆమె పెళ్లి కాకుండానే తల్లి కావడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాబోయే భర్త అలెగ్జాండర్ గిల్క్స్‌తో కలిసి కొంతకాలంగా ఆమె సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె జూలై 1వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా షరపోవా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. తమ బాబుకు థియోడర్ అని పేరు పెట్టినట్లు…