తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సమస్యల పరిష్కారంలో నేడు మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగగా.. ఈరోజు సీఎస్‌ల నేతృత్వంలోని అధికారుల కమిటీ మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో జరుగుతున్న సమావేశం ఇదే. ఏ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై అధికారుల కమిటీ చర్చించనుంది. ఏపీ పునర్వవ్యస్థీకరణ…