ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జయంతి వేడుకలతో పాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్ రెడ్డి నివాళులు అర్పించి, ప్రత్యేక…