మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏ తేదీన పెట్టాలనే విషయంలో కార్యవర్గం, ఎన్నికల నిర్వహణ కమిటీ ఎంతో మల్లగుల్లాలు పడ్డాయి. సెప్టెంబర్ లో ఏదో ఒక ఆదివారం పెట్టే కంటే… అక్టోబర్ 10వ తేదీ సెకండ్ సండే పెడితే, అందరికీ సౌలభ్యంగా ఉంటుందని ఏకాభిప్రాయానికి వచ్చింది. ఆ ప్రకారమే మరో మూడు రోజుల్లో ‘మా’ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటి వరకూ ‘మా’ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… ఫిల్మ్ ఛాంబర్ భవంతిలోనే జరిగాయి. అందులోని సెకండ్ ఫ్లోర్ లో…