77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా రంగం పరంగా రాజేంద్రప్రసాద్‌తో పాటు మురళీమోహన్‌కు పద్మశ్రీ ప్రకటించారు. అయితే, రాజేంద్రప్రసాద్ పద్మశ్రీ వెనుక ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి పద్మ అవార్డులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజేంద్రప్రసాద్ పేరును సిఫార్సు చేయగా, ఆయనకు కేంద్ర…