Off The Record about: తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తామని చెబుతోంది బీజేపీ. సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్స్‌గా పోటీ చేయమంటూ స్థానిక నేతలకు ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడే ఒక కొత్త చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. పైవాళ్ళు ఆదేశాలు ఇవ్వడం వరకు బాగానే ఉందిగానీ… కింది స్థాయిలో అసలు మనకంత సీన్ ఉందా అని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఆశ ఉండవచ్చుగానీ… దురాశ, పేరాశల్లాంటివి పనికిరావుకదా అంటూ వాళ్ళలో వాళ్ళే సెటైర్స్ వేసుకుంటున్నారట.…
TG Local Body Elections: తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను…