TS SSC Hall Ticket 2025: తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారు ఈరోజు (శుక్రవారం) నుంచి వెబ్ సైట్‌లో తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.