తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం అయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తియిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో…