జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చిన ఇంటర్ బోర్డు.. తాజాగా కొత్త తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. ఇదే సమయంలో రాష్ట్రంలో జరగనున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్… తెలంగాణలో మే 23వ తేదీ నుంచి ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్టు…