రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తోపాటు కృత్రిమ మేధ ( ఏఐ) సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన సమర్థవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Registrations : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలు అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ఆధునీకరణ కొనసాగుతున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా, కేవలం 10–15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. మొదటి దశగా రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 22 కార్యాలయాల్లో ఈ విధానం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి…