Home
Telangana Rains
Telangana Rains News
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
Heavy Rain Alert for AP and Telangana: ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో తీవ్ర తుఫాన్ ‘మురసు’ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ తీవ్రంగా బలపడటంతో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మురసు తుఫాన్… -
Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సముద్రంలో బలపడిన ఈ వాయుగుండం క్రమంగా బలపడి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ 28, 29, 30 తేదీలలో ఈ తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున, రాష్ట్రంలోని వివిధ… -
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
Telangana Rains: వినాయకచవితి నాడు వరుణుడు కరుణించాడు. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వర్షాలు లేక అలమటించి పోతున్న రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక, ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వరుణుడు ప్రతాపం చూయిస్తున్నాడు. నగరంలోని కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్పల్లి, మియాపూర్, అంబర్పేట్, గచ్చిబౌలిలో వర్షం కుమ్మేస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది.… -
Telangana Rains : తెలంగాణలో కుండపోత.. మహబూబాబాద్‌లో 19.1 సెం.మీ వర్షం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) అందించిన అధికారిక గణాంకాల ప్రకారం, శనివారం ఉదయం 08:30 గంటల నుండి ఆదివారం ఉదయం 06:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మహబూబాబాద్, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, వరంగల్ , నల్గొండ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షపాతం రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా… -
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 5, 2026 నాటి మీడియా వాతావరణ బులెటిన్‌లో వివరాలను వెల్లడించింది. వాయువ్య మధ్యప్రదేశ్ , దానికి ఆనుకుని ఉన్న నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు ఉదయం 08:30 గంటలకు సాధారణ అల్పపీడనంగా బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు… -
Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపు నీటితో జిల్లాలోని చెరువులు, కాలువలు పూర్తిస్థాయిలో నిండడమే కాకుండా, వాగులు , వంకలు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో చింతల మానేపల్లి మండలంలోని దిందా, కేతుని గ్రామాల మధ్య ఉన్న లో-లెవల్ వంతెన… -
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది.… -
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
తెలంగాణలో రాగల కొన్ని గంటల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం… -
Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వెల్లడించింది. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, భూపాలపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎల్లో అలర్ట్ జారీ.. ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు… -
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
Varuna Yagam : రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వేదికగా ‘మహా వరుణ యాగం’ నిర్వహించింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్రతువును చేపట్టారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు , వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు 11 హోమగుండాలతో ఈ మహా యాగాన్ని శాస్త్రోక్తంగా పూజలు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్‌పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!