సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఇది వరకు 44 మృతదేహాలు గుర్తించిన విషయం తెలిసిందే. లభించని ఆ 8 మంది విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో 8 మంది ఆచూకీ లభించడం కష్టమేనని నిర్ణయానికి వచ్చారు. రాహుల్, వెంకటేష్, శివాజీ, విజయ్, జస్టిన్, అఖిలేష్, రవి, ఇర్ఫాన్‌లు పూర్తిగా కాలి బూడిదైపోయి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆచూకీ లభించని ఆ 8 మంది మృతి చెందినట్లు అధికారులు…
Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశామైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) ఫార్మా కంపెనీలో ఇటీవల జరిగిన భారీ పేలుడు అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 39కి చేరింది. ఇప్పటికే 38 మంది మృతి చెందగా, తాజాగా ధృవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో కార్మికుడు మరణించడంతో మరణాల సంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన భీమ్‌రావుగా…
CM Revanth Reddy : సంగారెడ్డిలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. సిగాచి ప్రమాదం అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణించిన సీఎం రేవంత్, “ఇలాంటి ఘోర ప్రమాదం తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. ఇది తీవ్రంగా కలిచివేసే విషాద సంఘటన. మేము బాధిత కుటుంబాలకు అండగా…
Patancheru : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమ తునాతునకలైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటల సమయంలో సీగాచి కెమికల్స్‌లో పని సాగుతున్న సమయంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కంపెనీ…