పల్లె నిద్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని రంగాపూర్ గ్రామంలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు పరిశీలించిన ఆయన.. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని.. ప్రతి ఊరికి మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్నామని చెప్పారు. దశలవారీగా అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడం,…