తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలివిజన్ రంగంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి సత్కరించేందుకు ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డుల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అవార్డ్స్‌కు సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి నియమించిన ఈ కమిటీలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి ప్రముఖ నిర్మాత శరత్…
Gaddar Awards 2024: తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించేందుకు అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయి. హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డులు, మన దేశంలో కేంద్ర ప్రభుత్వ పురస్కారాలతో పాటు ఫిల్మ్ ఫేర్, సైమా వంటి వివిధ అవార్డులు సినీ రంగానికి చెందిన వారికి గుర్తింపుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నంది అవార్డులు’ ప్రకటించేది. అయితే ఉమ్మడి రాష్ట్రం విభజన అనంతరం అవి నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు…