Central Govt Ban State Power Purchases Telangana: విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించలేదన్న కారణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 13 రాష్ట్రాల డిస్కంల రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం గురువారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించింది. ఇకపై డిస్కంలు ఇంధన ఎక్స్చేంజి ద్వారా విద్యుత్ కొనుగోలు, మిగులు కరెంట్ అమ్మకాలకు అవకాశం ఉండదు. దీనివల్ల తలెత్తే లోటు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధించే అవకాశం ఉంది. దీంతో అధికారులు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.…
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఆ తర్వాత ఫిర్యాదులు, లేఖలు ఇలా ముందుకు సాగింది.. ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు.. ఇప్పటికే కేఆర్‌ఎంబీకి.. ఏపీ నుంచి, తెలంగాణ నుంచి లేఖలు వెళ్లగా.. తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు ఇప్పుడు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీటి విడుదల…