తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాయి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు.. నవంబర్ 31నే ప్రతిపాదనలకు చివరి రోజు కాగా.. డిసెంబర్ 27వ తేదీ వరకు అదనంగా గడువు ఇచ్చింది ఈఆర్సీ.. అయితే ఇప్పటికే ఏఆర్ఆర్లు సమర్పించిన డిస్కమ్స్.. మొత్తంగా 6831 కోట్ల చార్జీల పెంపునకు ప్రతిపాదనలు అందగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక, విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడిన టీఎస్ పీడీసీఎల్ సీఎండీ…