Home
Telangana Drought
Telangana Drought News
-
KTR : పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఏంటి.?
రాష్ట్రంలో కరువు కష్టాలు నమ్ముకుని జనాలు అల్లాడిపోతుంటే, సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం మూసీ సుందరీకరణే లోకంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిచ్చినట్లుంది రేవంత్ రెడ్డి పరిస్థితి” అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కరువని ఆరోపించారు. తాము… -
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
తెలంగాణలో తలెత్తిన కరువు పరిస్థితులు , విద్యుత్ సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసమర్థుడికి అధికారం అప్పగిస్తే ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా రేవంత్ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. కరువు రాగానే ప్రభుత్వం చేతులెత్తేసిందని, ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రెంకెలు వేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కాదని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని,… -
CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రకృతి విపత్తులు, కరువు పరిస్థితులు, రాజకీయ పరిణామాలు మరియు గత ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టమైన విశ్లేషణ చేశారు. కరువు ప్రారంభంలో చిన్నగా అనిపించినా, జూలై నాటికి తీవ్ర రూపం దాల్చుతుందని, తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోనూ కరువు ప్రభావం ఉందని,… -
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు, ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ జర్నలిస్టులు, ఆదివాసీలపై దాడులు చేయిస్తూ స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎల్ నినో వస్తుందని పది నెలల ముందే సమాచారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు” ఇప్పుడు రేవంత్… -
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో కురిసిన తక్కువ వర్షపాతం, దాని వల్ల ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 12న సచివాలయంలో మంత్రులతో ఉన్నత స్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గి కరవు ఛాయలు అలముకున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు , ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ ఉపశమన చర్యలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు. అతి… -
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఎల్ నినో (El Niño) ప్రభావం, దానివల్ల తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావం కారణంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తాగునీరు, సాగునీటి ఎద్దడిపై మంత్రులు లోతుగా సమీక్షించారు. బాధితులను ఆదుకునేందుకు తక్షణమే చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీని రంగంలోకి… -
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకవర్గాల చేతగానితనం వల్లే రైతాంగం కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందని, నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎత్తిపోయకుండా ‘క్రాప్ హాలిడే’ పేరిట రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రకృతి లేదా కాలం తెచ్చిన కరువు కాదని, కేవలం కాంగ్రెస్ పాలకులు తెచ్చిన ‘కృత్రిమ కరువు’ అని ఆయన అభివర్ణించారు. గత ముప్పై ఏళ్లలో… -
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
Story Board: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో 15 శాతం తక్కువ వర్షపాతంనమోదు కాగా, ఎల్ నినో కూడా ఏర్పడటంతో తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దక్షిణ ద్వీపకల్పం తీవ్రంగా ప్రభావితమై 28 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యంత కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దేశంలోని… -
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
El Nino : రాష్ట్రంలో ఎల్నీనో ప్రభావంతో సాధారణం కంటే వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్… -
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
Telangana Drought Alert 2026: తెలంగాణలో ఈ ఏడాది ‘వర్షాకాలం’ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెమ్మదిగా కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఈ సమయానికి సాగు పనులు ఊపందుకోవాల్సి ఉండగా.. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికే భూమి మొత్తం పచ్చగా కనిపించాల్సి ఉండగా.. విత్తనాలు మాడిపోగా, ఆరుమళ్లు ఇంకా మొలకెత్తలేదు. రైతులపై అదనపు…
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!