Sudharshan Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరు గ్యారంటీల అమలు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు కీలకమైన భాధ్యత లభించడం, పార్టీ అంతర్గత రాజకీయాల్లో సమతుల్యత సాధించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన…