తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో చేపట్టిన పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించిన ఆయన మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి కాళేజీకి చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బసచేయనున్నారు. సంజయ్ బస కోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.…
తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ సంజయ్ గారి ధృఢ చిత్తం, పోరాట పటిమ తెలంగాణలో ఆయనను రాజకీయ ధృడ సంకల్పం కలిగిన నేతగా నిలిపాయి.…