తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ (United Breweries Limited) వివరణ ఇచ్చింది. 2019 నుంచి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ధరలు పెంచలేదని తెలిపింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూ బీర్లు సరఫరా చేశాం.. ధరలు సవరించాలని టీజీబీసీఎల్‌ను అనేక సార్లు కోరామన్నారు.
No More Kingfisher Beers : తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్ ప్రియుల గుండె పగిలిపోయే విషయం ఇది. కింగ్‌ఫిషర్ బ్రాండ్ బీర్ తయారీదారులైన యునైటెడ్ బ్రేవరీస్ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)కి ‘గణనీయమైన , కొనసాగుతున్న ఆపరేటింగ్ నష్టాల’ కారణంగా తక్షణమే అన్ని బ్రాండ్‌ల కింగ్‌ఫిషర్ బీర్‌ల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. బీర్ తయారీదారు గత నాలుగు సంవత్సరాలుగా నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, దాని ఉత్పత్తులకు అందించే బేస్ ధరలలో పెరుగుదల లేదని పేర్కొంది. “ఇది…