Harish Rao: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. శాసనసభ నిబంధనలను పట్టించుకోకుండా అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని పేర్కొన్నారు. "రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి.
TG NEWS: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది.. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తయింది.. స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు రిజర్వ్ చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల స్పీకర్ విచారణ ఇంకా పూర్తి కాలేదు.. రేపో, ఎల్లుండో కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ ముందుకు రానున్నారు.
Telangana Assembly News: శాసనసభలో కాళేశ్వరం కమిషన్‌పై చర్చ మొదలైంది. సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడిన దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆనాడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈనాటికీ మంత్రిగా ఉన్నట్లుగానే భావిస్తున్నారని అన్నారు. నీరు అందుబాటులో ఉందని చెప్పినా మళ్లీ పరిశీలించాలని లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారిని…
Telangana Assembly 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు ప్రారంభంకానున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఒక్కరోజు విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఇవాళ తిరిగి సమావేశం కానుంది.