Netherlands Squad for ICC ODI World Cup 2023: భారత గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023కి నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు తమ జట్టును గురువారం ప్రకటించింది. మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టుతో సహా ఇద్దరు రిజర్వు ప్లేయర్లను ఎంపిక చేసింది. నెదర్లాండ్స్ జట్టును స్కాట్ ఎడ్వర్డ్స్ నడిపించనున్నాడు. ఈ జట్టులో తెలుగు మూలాలున్న తేజ నిడమనూరుకు చోటు దక్కింది. విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగిన తేజ.. ప్రస్తుతం అంతర్జాతీయ…
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్‌పై వెస్టిండీస్ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. షాయ్ హోప్ అజేయ సెంచరీతో చెలరేగడంతో విండీస్ విక్టరీ కొట్టింది. అయితే వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 45ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా నెదర్లాండ్స్ 247 లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు పెట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో మన తెలుగు తేజం తేజా నిడమనూరు ఆకట్టుకున్నాడు. విజయవాడకు చెందిన…