France: ఫ్రాన్స్‌తో పాటు బెల్జియం, ఇతర యూరోపియన్ దేశాల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరుగుతోంది. పలువురు ఆయా దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే 2020లో ఫ్రెంచ్ ఉపాధ్యాయుడు శామ్యూల్ పాటీని తల నరికి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ కేసులో ఆరుగురు టీనేజర్లను ఫ్రెంచ్ కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది.