తన రాజకీయ విరామంపై ఎంపీ గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సభ నిర్వహించారు ఎంపీ గల్లా జయదేవ్. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఎంపీగా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీతో పాటు ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజ