టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కొడాలి నాని ఆ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చంద్రబాబు లాక్కున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ఎలాంటి ప్రేమ లేదని.. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మీరే పార్టీ లాక్కుంటారని.. మీరే వెన్నుపోటు పొడుస్తారని.. మీరే మళ్లీ ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తారని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.…