‘సూపర్ సిక్స్’ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్న హామీని కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారని…