మదనపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ తన్నులాట పీక్స్ చేరిందని అంటున్నారు. డజన్ మందికి పైగా నేతలు ఈ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా... చివరికి అధినేత చంద్రబాబు మాత్రం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషావైపు మొగ్గు చూపారు. దీంతో అసంతృప్తితో ఉన్న మిగతా నేతలు ఎన్నికల్లో షాజహాన్‌కు సహకరించలేదని చెప్పుకుంటారు. చివరికి కొన్ని చోట్ల ఏజెంట్లను కూడా పెట్టలేదట.