తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం.. ఒక రాజకీయ అనివార్యం.కొందరు వ్యక్తుల కోసమో.. కొందరి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ…
టీడీపీ ఆవిర్భావ వేడుకలను వివిధ దేశాల్లో జరుపుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. 40 దేశాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు ఆయా దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు. విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పుట్టింది. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్. తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందే. పటేల్, పట్వారీ వ్యవస్థ…
అధికారం కోల్పోయినా అక్కడి నేతల్లో మార్పు రావడంలేదా? ఆధిపత్య పోరుతో పార్టీ ప్రతిష్ట మంటగలుపుతున్నారా? కీలక నేతలే సొంతగూటిలో చీలికలకు కారణమా? పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా సొంత లాభానికే మొగ్గు చూపుతున్నారా? ఎవరా నాయకులు.. తెరవెనక వేస్తున్న ఎత్తుగడలేంటి? సిక్కోలు జిల్లాలో టీడీపీ కీలకనేతల మధ్య కోల్డ్‌వార్‌టీడీపీ కంచుకోట సిక్కోలు జిల్లా. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు పార్టీకి అండగా ఉండి.. మెజార్టీ స్థానాలు కట్టబెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ ఒక…
చంద్రబాబుకు వచ్చింది కోపమేనా..? టీడీపీని చక్కదిద్దుకునేందుకు చికిత్స మొదలుపెట్టిన ఆయనకు.. వాస్తవాలు తెలుస్తున్నకొద్దీ కోపం నషాళానికి ఎక్కుతోందా? కొందరు కోవర్టులుగా మారారనే అనుమానం రోజు రోజుకూ బలపడుతోందా? చేతలు కాలక ఆకులు పట్టుకున్న బాబు.. ఆగ్రహాన్ని కంటిన్యూ చేస్తారా..? మధ్యలోనే మెత్తబడతారా..? పార్టీ చీఫ్‌కు వచ్చిన కోపంపై తమ్ముళ్లలో చర్చ..! టీడీపీలో కోవర్టులున్నారని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. మండలం.. నియోజకవర్గం.. జిల్లా స్థాయిల్లో కాదని.. ఏకంగా రాష్ట్రస్థాయిలోనే కోవర్టులు ఉన్నారని.. వారిని ఏరిపారేస్తానని కుప్పం సమీక్షలో చెప్పారు…
ఆయన గళం విప్పితే ప్రజలు జేజేలు కొట్టారు. అండగా ఉంటారని ఆదరించారు. తీర చూస్తే ప్రజలను.. కార్యకర్తలను వదిలేసి.. అంతఃపురం దాటి బయటకు రావడం లేదట. నాయకుడి జాడ లేక వేరే దారి వెతుక్కుంటున్నారట కార్యకర్తలు. మనవాడు ఇప్పుడే కాదు.. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏదో ఒక సాకుతో చెక్కేయడం కామనే అని సెటైర్లు వేస్తోంది కేడర్. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? అందుబాటులో లేని నేతను వదిలించుకోవాలని కేడర్ చూస్తోందా? గుంటూరు జిల్లా…
ఏదైనా సమస్య వస్తే నాయకుడి దగ్గరకు కేడర్ వెళ్లడం సాధారణం. పార్టీ పవర్‌లో ఉన్నా.. లేకపోయినా.. శ్రేణులకు అందుబాటులో ఉన్న నేతలే దేవుళ్లు. ఆ జిల్లాలో మాత్రం కేడర్‌ను, పార్టీని పట్టించుకునే వాళ్లు లేరు. తమ్ముళ్లు దిక్కులేని వారిగా మారిపోయారు. అధినేత ఎప్పుడు కరుణిస్తారా అని రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో దిక్కులేకుండా పోయిన టీడీపీ కేడర్! చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు ఈ దఫా పెద్దకష్టమే వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత…