గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆసుపత్రి వైద్యులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. తమ్మినేని గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం వెంట మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ…