శ్రీకాకుళం జిల్లాలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో వాలంటీర్లకు పురస్కారాలను ప్రధానం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు , పలువురు ఎమ్మెల్యేలు అధికారులు హాజరయ్యారు. ఐతే కార్యక్రమం జరుగుతున్న క్రమంలో 14 వార్డులోని ఐ జె.నాయుడు కాలనీకి చెందిన లొట్ల అనీల్ కుమార్ అక్కడికి వచ్చాడు . స్పీకర్ ను…